వృద్ధుడిని కాపాడి ఆశ్రమానికి చేర్చిన ఘట్కేసర్ పోలీసులు
ఘట్ కేసర్, నవంబర్ 5 (విజయక్రాంతి) : ఘట్కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలోని ఎదులాబాద్ లో దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న ఓ గుర్తుతెలియని వృద్ధుడిని(An unidentified old man) ఘట్కేసర్ మహిళా పోలీస్ కానిస్టేబుల్ మానస(Ghatkesar woman police constable Manasa) గమనించి రక్షించారు. సదరు వృద్ధుడిని విచారించగా తన పేరు చుంచు రాములు, తండ్రి పేరు ఎల్లయ్య అని మాత్రమే చెబుతున్నారని, అయితే మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తన స్వగ్రామం, కుటుంబ సభ్యులు, ఇతర పూర్తి వివరాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నట్లూ దీంతో ఆయన భద్రత, బాగోగులను దృష్టిలో ఉంచుకుని, పోలీసుల పర్యవేక్షణలో ఘట్కేసర్ డివిజన్, కొండాపూర్లోని అమ్మ నాన్న ఆశ్రమంకు సురక్షితంగా తరలించి ఆశ్రయం కల్పించడం జరిగింది.
ఈ ఫోటోలో కనిపిస్తున్న వృద్ధుడి కుటుంబ సభ్యులు, బంధువులు లేదా ఆయన ఆచూకీ తెలిసిన వారు వెంటనే ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాల్సిందిగా కోరడమైనది.
ఫోన్ నంబర్ 8712662705