వాగ్వాదంలో వ్యక్తిని లారీ కిందకు నెట్టి చంపిన ఘటన

21-10-2026 | 07:57pm

ముగ్గురు నిందితులపై కేసు నమోదు

ఘట్ కేసర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): నలుగురు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదంలో ఓ వ్యక్తిని లారీ కిందికి నెట్టి చంపిన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టే(Ghatkesar Police Station) పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన దుర్లభ్ (24) భువేకాంత్ శ్యామ్ (26), లఖన్ సింగ్ (26), మనోజ్ సింగ్ (37), కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ నలుగురు వ్యక్తులు మంగళవారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, అవుషాపూర్‌లోని హెచ్ ఎల్ స్పిరిట్ వైన్స్ ఎదుట గొడవపడ్డారు. ఆ వాగ్వాదంలో దుర్లభ్ అనే వ్యక్తిని భువేకాంత్ శ్యామ్  అనే వ్యక్తి  బలంగా రోడ్డుపైకి నెట్టేశాడు. ఆ సమయంలో వరంగల్ వైపు నుంచి సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న లారీ (KA51AF5067) దుర్లభ్ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించిన మిగతా ముగ్గురు వ్యక్తులను స్థానికుల సహాయంతో పట్టుకున్నారు. ప్రత్యక్ష సాక్షి సయ్యద్ అక్రమ్ అలీ ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు