సెల్లార్ పేరిట మొరం దందాపై విచారణ

23-09-2026 | 05:05am

భారీగా మొరం బయటకు విక్రయించినట్లు గుర్తింపు

మేడ్చల్, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా(Medchal District) గుండ్ల పోచంపల్లి(Gundla Pochampally) శివారులో సెల్లార్ పేరిట మొరం దందాపై గనులు భూగర్భ శాఖ(Department of Mines and Geology) అధికారులు మంగళవారం విచారణ జరిపారు. విజయక్రాంతి దినపత్రికలో 21వ తేదీన ’అపార్ట్మెంట్ సెల్లార్ పేరిట మొరం దందా ’ శీర్షికన వచ్చి న కథనానికి అధికారులు స్పందించి తవ్వుతున్న ప్రాంతానికి వెళ్లారు. గనుల శాఖ ఏడి సైదులు(Mining Department AD Saidulu) ఆదేశాల మేరకు ఆర్ ఐ నాగమణి విచారణ జరిపారు.

ఎంత లోతు తవ్వారు, ఎంత మొరం తీసి బయటకు తరలించారు అనేది అంచనా వేశారు. ఎలాంటి అనుమతి లేకుండా లోతుగా తవ్వి భారీ మొత్తంలో మొరాన్ని బయటకు తరలించినట్లు గుర్తించారు. బిల్డర్ కు పెద్ద మొత్తంలో జరిమానపడే అవకాశం ఉంది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆర్ ఐ నాగమణి తెలిపారు.

మరిన్ని వార్తలు