సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం
100 యూనిట్ల రక్త సేకరణ
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్‌కేసర్ డివిజన్ కొండాపూర్ లోని సంస్కృతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో జాతీయ సేవా పథకం(National Service Scheme) ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సంయుక్త(Indian Red Cross Society United) ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. మొత్తం 100 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లు మాట్లాడుతూ రక్తదానం(blood donation) ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
శిబిరాన్ని విజయవంతం చేసిన రక్తదాతలు, రెడ్‌క్రాస్ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. జానకి రాములు, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శివ కేశవ రెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. నరసింహారావు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ఎం. హరి ప్రసాద్, కె. అనిల్ కుమార్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.