ఈ నెల 11న నిజామాబాద్‌లో జాబ్ మేళా
10-09-2026 | 12:54pm
బోధన్,సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): నిజామాబాద్(Nizamabad ) శివాజీ నగర్ లోని ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో జాబ్ మేళా(Job fair) నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి వేల్పుల విజేత తెలిపారు. ప్రైవేటు కంపెనీలో పని చేసేందుకు ఫార్మసిస్ట్ కోసం డీ ఫార్మసీ, బీ ఫార్మసీ పూర్తి చేసిన వారు, అలాగే ఫార్మసీ ఎయిడ్ కోసం ఇంటర్మీడియట్ పూర్తి చేసినవారు అర్హులన్నారు. ఈనెల 11న ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు మేళా నిర్వహిస్తామని తెలిపారు.