దళిత స్పీకర్‌పై వ్యాఖ్యలకు నిరసన

10-09-2026 | 12:57pm

బోధన్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై(Gaddam Prasad Kumar) బీఆర్ఎస్ నేతలు తాతా మధు, హరీశ్ రావు, కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బోధన్‌లో NSUI, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో వినూత్న రీతిలో నిరసన తెలిపి, అనంతరం డా. బీఆర్ అంబేద్కర్(Dr. B.R. Ambedkar) విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. దళిత సమాజాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకులు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో NSUI అధ్యక్షుడు అనిల్ కుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యాగ్నేశ్, రంజిత్, ప్రకాశ్, విట్టల్, మధు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు