తక్కెళ్ళపాడు గ్రామ చెరువుకు గోదావరి జలాలు

10-09-2026 | 09:58pm

మంత్రోచ్ఛారణల మధ్య గోదావరి జలాలకు ఘన స్వాగతం పలికిన సర్పంచ్ ముక్కర రామక్రిష్ణ రెడ్డి

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఎర్రుపాలెం మండలాల రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆయకట్టు(Nagarjuna sagar dam canals)లోని  రెండో జోన్‌కు సాగునీరు అందించేలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సాగర్ కెనాల్ ద్వారా గోదావరి జలాలను విడుదల చేశారు. నిదానపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా తక్కెళ్ళపాడు గ్రామ చెరువుకు గోదావరి నీళ్లు విడుదల కాగా, మంత్రోచ్ఛారణల మధ్య సర్పంచ్ ముక్కర రామక్రిష్ణ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వర రెడ్డి, పీసీసీ సభ్యులు శీలం ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల తో కలిసి స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టి,హరితి ఇచ్చి పూలతో తల్లి గోదావరి జలాలను స్వాగతించారు.

 సర్పంచ్ ముక్కర రామక్రిష్ణ రెడ్డి మాట్లాడుతూ... రైతుల పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ప్రత్యేక చొరవకు ఇదే నిదర్శనం. వర్షాభావ పరిస్థితుల్లో రైతుల(Farmers) సాగునీటి సమస్యలను ముందుగానే గుర్తించి, వారి ప్రయోజనాల కోసం భట్టి విక్రమార్క గారు చూపిన ప్రత్యేక శ్రద్ధ, నిరంతర కృషి ఫలితంగానే ఎర్రుపాలెం మండలాలకు, మన గ్రామంకి గోదావరి జలాలు చేరుతున్నాయి. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులతో సమన్వయం చేసి గోదావరి జలాలను విడుదల చేయించిన  భట్టి విక్రమార్క  పత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముక్కర చిన్న లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిలూరి రవీంద్ర రెడ్డి,శీలం మాధవ్ రెడ్డి, వార్డ్ నెంబర్లు,రైతులు, గ్రామం ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు