చంద్రపురి కాలనీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రాహుల్
జవహర్ నగర్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): జవహర్ నగర్(Jawahar Nagar) లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తానని చంద్రపురి కాలనీ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాహుల్ కదం(Rahul Kadam) పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ చంద్రపురి కాలనీ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రాహుల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారితో వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అర్హులకు అందే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అందరూ కలిసికట్టుగా ఉండి రాబోయే రోజుల్లో పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి గెలుపు కోసం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు... అనంతరం నూతనంగా నియమితులైన రాహుల్ మాట్లాడుతూ నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం జవహర్ నగర్ లో నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు గడ్డం శ్రీనివాస్, ఏ బ్లాక్ అధ్యక్షులు మాట్ల శ్రీనివాస్, మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్త, సీనియర్ నాయకులు బల్లి శ్రీనివాస్, మాట్ల వినయ్ కుమార్, వెంకటేష్, నాయకం భాస్కర్, కాలేషా, సోమేశ్చారి, గణేష, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.