చంద్రపురి కాలనీ డివిజన్లో జోనల్ కమిషనర్ పర్యటన
11-09-2026 | 07:27pm
సమస్యల పరిష్కారానికై కృషి చేద్దాం
మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ఐఏఎస్
జవహర్ నగర్,(విజయక్రాంతి): సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని, ఓపెన్ నాలాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్(Malkajgiri Zonal Commissioner Sanchit Gangwar) ఆదేశించారు. చంద్రపురికాలనీ డివిజన్లో(Chandrapur Colony Division) జోనల్ కమిషనర్ అధికారులతో కలిసి పర్యటించి శుక్రవారం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంచిత్ గంగవర్ మాట్లాడుతూ వర్షాకాలంలో నీరు సాఫీగా వెళ్ళేందుకు తక్షణమే నిధులు కేటాయించి అభివృద్ధిచేస్తామని అన్నారు. అనంతరం న్యూ వెంకటేశ్వరకాలనీ, ముత్తుస్వామికాలనీ ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ మాధవాచారి, మాజీ కార్పొరేటర్ బాబు, కాలనీవాసులు పాల్గొన్నారు.