గణేష్ మండపాల నిర్వాహకులు పలు జాగ్రత్తలు పాటించాలి

11-09-2026 | 08:08pm

 డీఎస్పీ సంపత్ రావు 

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పలు జాగ్రత్తలు పాటించాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు(Bhupalpally DSP Sampath Rao) అన్నారు. గణేష్ మండపాల నిర్వాహకుల(Ganesh Mandapam organizers)తో శుక్రవారం సీఐ చెన్నూరి శ్రీనివాస్(CI Chennuri Srinivas) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి అనుమతి, విద్యుత్ వినియోగం కోసం విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.

రాకపోకలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై కాకుండా ఖాళీ స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. డీజేలు, లౌడ్ స్పీకర్లు వాడకుండా చిన్నపాటి బాక్సులను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మండప నిర్వాహకులు ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే సమాచారం అందించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. అనంతరం సైబర్ క్రైమ్ అవగాహనకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు