ఎరువుల దుకాణాల్లో డీఏఓ తనిఖీలు

11-09-2026 | 07:51pm

- అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

కొండపాక,(విజయక్రాంతి): మండలంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను(fertilizer stores) జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి(District Agriculture Department Officer Swaroop Rani) తనిఖీ చేశారు. దుకాణాల్లో ఎరువుల నిల్వలు, విత్తనాల విక్రయాలు, రికార్డులు, రసీదులు, బిల్లులను పరిశీలించారు. ఎరువులు, విత్తనాల నిల్వలు, విక్రయ వివరాలను దుకాణాల్లో ఏర్పాటు చేసిన బోర్డులో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ఈ-పాస్ ద్వారానే ఎరువుల విక్రయాలు జరపాలని ఆదేశించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించినా, ఒక ఎరువుతో పాటు మరో ఎరువును లింక్ చేసి విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి శివరామకృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు