లాస్ ఏంజెల్స్ మ్యూజియంలో రామాయణ ప్రీమియర్
రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం(Ramayana Film) వరల్డ్ ప్రీమియర్‌కు(World Premiere) సిద్ధమవుతోంది. 2026 అక్టోబర్ 27 సాయంత్రం లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ఉన్న డేవిడ్ గెఫెన్ థియేటర్లో ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ జరగనుంది. సినిమాను 3డీ వెర్షన్లో ప్రదర్శించనున్నారు. అకాడమీ మ్యూజియం చలనచిత్ర చరిత్ర, కళ, సాంకేతికతకు అంకితమైన ప్రముఖ సంస్థ.
గతంలో ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాలకు, ఆస్కార్‌కు సంబంధించి వేడుకలకు ఈ మ్యూజియం వేదికైంది. ఇప్పుడు ‘రామాయణ’ ప్రీమియర్ అక్కడ జరగనుండటం ఈ చిత్రబృందానికి ఒక ముఖ్య ఘట్టంగా నిలువనుంది. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేసే దిశగా ఇది కీలక ముందడుగు కానుంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో ఈ సినిమాను ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
దీనికి హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం ఇదే ఏడాది నవంబర్ 5న విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.