మాస్ మహారాజా.. ఇక రచ్చే!

05-10-2026 | 06:19pm

మాస్ రాజా రవితేజకు హిట్ పడితే స్పీడ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ‘ఇరుముడి’తో రికార్డ్ బ్రేకింగ్ సక్సెస్ అందుకున్న వెంటనే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి మాస్ రాజా కాస్త కొత్త రూట్‌లో వెళ్లబోతున్నారట. క్రేజీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో రవితేజ తన తదుపరి సినిమాను చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

ఈ ప్రాజెక్ట్‌ను బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ మాస్ ఇమేజ్‌కు వివేక్ ఆత్రేయ స్టైల్ ఆఫ్ మేకింగ్ కలిస్తే స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ‘ఇరుముడి’తో జోరు మీదున్న మాస్ రాజా.. ఇప్పుడు వివేక్ ఆత్రేయతో ఎలాంటి కథతో వస్తారన్నదే అసలు సస్పెన్స్. ఈ కాంబో అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారన్నదానిపై ఇప్పుడు టాలీవుడ్‌లో బజ్ పెరుగుతోంది.

మరిన్ని వార్తలు