అనుమతి లేకుండానే పరీక్షల నిర్వహణ...?

05-10-2026 | 06:45pm

విద్యాశాఖ అధికారుల అనుమతి లేకుండానే పరీక్షల నిర్వహణ...?

శ్రీ చైతన్యలో 8, 9 తరగతుల వ్యవహారంపై కలకలం...!

ప్రశ్నపత్రాలు ఎవరివి..? అనుమతులు ఎక్కడివి...!

విద్యాశాఖకు సవాల్‌గా మారిన శ్రీ చైతన్య పాఠశాల వ్యవహారం...

పాఠశాల యాజమాన్యం తీరుపై ప్రశ్నల వర్షం...

జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారుల మౌనమేల ?

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శ్రీ చైతన్య పాఠశాల(Sri Chaitanya School)లో 8,9 తరగతుల నిర్వహణకు సంబంధించిన అనుమతుల వ్యవహారం ఇంకా స్పష్టతకు రాకముందే పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశం చర్చనీయాంశంగా మారింది. పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి..? వాటిని ఎవరు అందించారు..? అనే ప్రశ్నలు తల్లిదండ్రులు, విద్యార్థుల వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల పాఠశాలలో 8, 9 తరగతుల నిర్వహణకు అవసరమైన అనుమతులపై విద్యాశాఖ అధికారులు(Education Department officials) స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. అనుమతుల విషయంలో అక్టోబర్ మూడో తేదీ గడువు విధించిన నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణకు సంబంధించిన వ్యవహారం తెరపైకి రావడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. ఇప్పటివరకు విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు రాలేదని పరీక్షల నిర్వహణ ఏ విధంగా నిర్వహిస్తారని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

ఎంఈఓ కార్యాలయం నుండి ఎలాంటి ప్రశ్న పత్రాలు ఇవ్వకుండా పాఠశాలలో పరీక్షలు ఏ విధంగా కొనసాగుతున్నాయని ప్రశ్నలు వెలువేతున్నాయి.విద్యాశాఖ నిబంధనలు బేకాతరూ చేస్తూ ఇస్టారీతిన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం వ్యవహరిస్తుంది. ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు మౌనం ఎందుకు ఉంటున్నారని మనం వెనుక మతల భూమిని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అనుమతులు లేకుండా తరగతుల నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.అనుమతుల వ్యవహారం, పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి పూర్తి వివరాలను బహిర్గతం చేస్తారా..? లేక ఈ వ్యవహారం ఇలాగే ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుందా..? అనేది వేచి చూడాలి.

ఎంఈఓ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు ఇవ్వలేదా..?

విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు సాధారణంగా సంబంధిత అధికారిక వ్యవస్థ నుంచి ప్రశ్నపత్రాలు అందాల్సి ఉంటుంది. అయితే శ్రీ చైతన్య పాఠశాల(Sri Chaitanya School)కు ఎంఈఓ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు అందలేదనే సమాచారం వస్తోంది. అలాంటప్పుడు పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షలకు ప్రశ్నపత్రాలు ఎవరు రూపొందించారు..? వాటికి ఎవరి అనుమతి ఉంది..? అనే ప్రశ్నలకు సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

నిబంధనలు పాటించారా..?

పాఠశాల నిర్వహణ, తరగతుల అనుమతులు, పరీక్షల విధానానికి సంబంధించి విద్యాశాఖ నిబంధనలు వర్తిస్తాయి. ఈ నిబంధనలకు అనుగుణంగానే అన్ని ప్రక్రియలు కొనసాగుతున్నాయా లేదా అన్నది విద్యాశాఖ అధికారులు పరిశీలించాల్సి ఉంది. అనుమతుల అంశం పూర్తిగా తేలకముందే పరీక్షల నిర్వహణ జరిగితే దాని వెనుక ఉన్న విధానంపై అధికారులు వివరణ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

జిల్లా ఉన్నతాధికారుల మౌనం ఎందుకు..?

స్థానిక స్థాయిలో ఈ వ్యవహారంపై ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ జిల్లా స్థాయి ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడంపై కూడా చర్చ జరుగుతోంది. పాఠశాలలో ఏ తరగతులకు అనుమతులు ఉన్నాయి..? ఏ తరగతులకు అనుమతులు లేవు..? పరీక్షలకు ప్రశ్నపత్రాలు ఎవరు అందించారు..? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

అనుమతులు లేని తరగతులకు ప్రశ్నాపత్రాలు ఇవ్వలేదు నాగేశ్వరరావు, విద్యాశాఖ అధికారి, బాన్సువాడ

శ్రీ చైతన్య పాఠశాలలో 8 9 తరగతులకు విద్యాశాఖ నుండి సంబంధించిన అనుమతులు పొందలేదు. ఆ తరగతులకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను కూడా ఎంఈఓ కార్యాలయం నుండి అందజేయలేదని మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు విజయ క్రాంతితో పేర్కొన్నారు. విద్యాశాఖ నిబంధనలు బేకాతలు చేస్తూ పరీక్షల నిర్వహణపై, ప్రశ్నాపత్రాలు విద్యాశాఖ నుండి అనుమతి లేకుండా ఏ విధంగా పరీక్షలు నిర్వహిస్తారు అనే అంశంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు