గుమ్మడికాయ కొట్టేశారు!

19-10-2026 | 05:10am

సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’(Sambaraala Eti Gattu) (ఎస్‌వైజీ). దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి టీమ్ గుమ్మడికాయ కొట్టేసింది. షూటింగ్ పూర్తి కావడంతో తదుపరి కార్యక్రమాలపై దృష్టి సారించారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం 160 రోజులకు పైగా చిత్రీకరణ జరిపారు. 10కి పైగా భారీ షూటింగ్ షెడ్యూల్స్‌ను పూర్తి చేశారు.

సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలవనుందీ ప్రాజెక్టు. మేకర్స్ ఈ సినిమాను 2027 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటుడు కీలక పాత్రలో నటిస్తుండగా, కన్నడ నటుడు ధనంజయ మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, నరేశ్ వీకే, సాయికుమార్, శ్రీకాంత్ మేక, అనన్య నాగళ్ల ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెట్రివేల్ పలనిసామి; సంగీతం: బీ అజనీష్ లోక్‌నాథ్; ఎడిటింగ్: నవీన్ విజయ్ కృష్ణ; ప్రొడక్షన్ డిజైన్: గాంధీ నడికుడికర్.  

మరిన్ని వార్తలు