ప్రారంభమైన నవోదయ ప్రవేశ పరీక్షలు

28-11-2026 | 01:26pm

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్షలు (Entrance Exams) శనివారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఏర్పాటు చేసిన 18 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4,284 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు.

మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష కొనసాగనుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు (Arrangements) చేశారు. పరీక్షల నిర్వహణను సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు