రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఆరుగురి ఎంపిక

28-11-2026 | 01:24pm

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్‌కు చెందిన ఆరుగురు క్రీడాకారులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు (State Level Athletics) ఎంపికయ్యారు. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో నిజామాబాద్‌లో నిర్వహించే పోటీల్లో రాధిక, దర్శి, గణేష్, జ్ఞానేశ్వర్, అజయ్, నవీన్ తమ ప్రతిభను చాటనున్నారు.

ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను ఎస్సై వెంకట్‌రెడ్డి సన్మానించి అభినందించారు. పోటీల్లో పట్టుదలతో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు. కోచ్ రాణా మల్లేష్ కూడా విద్యార్థులను అభినందించారు. క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు