మూడో యూనిట్ నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో
* మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
* విద్యుత్ ప్లాంట్ల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ఖమ్మం, అక్టోబర్ 4 విజయక్రాంతి: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని(Bhadradri Thermal Power Station) మూడో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి(Electricity generation) నిలిచిపోవడంపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Former Minister Puvvada Ajay Kumar) రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న సమయంలో కీలకమైన యూనిట్ నిలిచిపోవడం ప్రభుత్వ విద్యుత్ నిర్వహణలో నిర్లక్ష్యానికి, వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ యూనిట్ నిలిచిపోవడంతో రోజుకు 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగిందని ఇప్పటివరకు సుమారు 15.5 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగిందని మాజీ మంత్రి పువ్వాడ ఆందోళన వ్యక్తంచేశారు.
విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో కీలకమైన పరికరాల నిర్వహణ, ముందస్తు తనిఖీలు, స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించిందో సమాధానం చెప్పాలని పువ్వాడ డిమాండ్ చేశారు. నిలిచిపోయిన మూడో యూనిట్‌ను వెంటనే పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో వెల్లడించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నించారు.