ఎగువ మానేరు నీరు విడుదలపై బీజేపీ హర్షం
టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్న శ్రేణులు
గంభీరావుపేట, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు(Narmala Upper Manair Project) ఆయకట్టు కింద పంటలు ఎండిపోతుండటంతో నీటి విడుదల కోరుతూ శనివారం బీజేపీ(BJP) ఆధ్వర్యంలో రైతులతో కలిసి కామారెడ్డి-సిద్ధిపేట ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.దీనికి స్పందించిన ఉన్నతాధికారులు మానేరు నీటిని విడుదల చేయడంతో రైతులు, బీజేపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.
మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్, డా. సత్యనారాయణ, తొట్ల మల్లేష్ యాదవ్, దేవసాని కృష్ణ, దేవేందర్ యాదవ్, నాగరాజు గౌడ్, ఓరగంటి ఎల్లం, సర్వోత్తం, యెలందర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.