విలేకరిపై లైన్‌మెన్ దుర్భాషల ఆరోపణలపై విచారణకు ఆదేశాలు

05-10-2026 | 10:18pm

విజయక్రాంతి ఎఫెక్ట్

కన్నాయిగూడెం, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలం విజయక్రాంతి దినపత్రికతో పాటు పలు దినపత్రికల్లో వచ్చిన కథనం వార్త రాసిన విలేకరిపై లైన్‌మెన్ దుర్భాషలు అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ ములుగు ఆపరేషన్ సర్కిల్ సూపరిండెంట్ అఫ్ ఇంజనీర్ బిక్షపతి స్పందించారు.

ముప్పనపల్లి లైన్‌మెన్ పి.రవిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమగ్ర వివరాలు సేకరించి ప్రాథమిక విచారణ నిర్వహించాలని ములుగు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సోమవారం రోజున ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తాడ్వాయి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆర్. రాజేష్‌ను విచారణ అధికారిగా నియమించి, సంబంధిత విలేకరి, గ్రామస్తులు, శాఖ సిబ్బంది వాంగ్మూలాలను సేకరించాలని ఆదేశించారు.

అలాగే శాఖ సిబ్బంది వైపు ఏవైనా తప్పిదాలు జరిగినట్లు తేలితే, వాటి వివరాలతో కూడిన ప్రాథమిక నివేదికను త్వరగా సమర్పించాలని మెమోలో పేర్కొన్నారు.అక్టోబర్ 5న జారీ చేసిన మెమోతో లైన్‌మెన్‌పై వచ్చిన ఆరోపణలపై అధికారిక విచారణ ప్రారంభమైనట్లు స్పష్టమవుతోంది. వర్కింగ్ జర్నలిస్ట్ లపై దుర్భాషలాడిన లైన్ మెన్ పై ప్రాథమిక విచారణకు సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో మండలంలోని వర్కింగ్ జర్నలిస్ట్ లు హర్షం వ్యక్తం చేసారు.

మరిన్ని వార్తలు