గాంధీ జయంతి వేళ ఫుల్ గా కల్లు
02-10-2026 | 12:27pm
బిజినేపల్లి: గాంధీ జయంతి(Gandhi Jayanti) వేళ మండల కేంద్రంలో ఫుల్లుగా కల్లు, మధ్య విక్రయాలు జరుగుతున్నాయి. మండల కేంద్రంలోని రెండవ కల్లు దుకాణంలో కల్లు విక్రయాలు జరుగుతుండగా, బెల్టు షాపుల్లో కూడా జోరుగా మద్యం విక్రయాలు(Alcohol Sales) జరుగుతున్నాయి. గాంధీ జయంతి వేళ మండల కేంద్రంలోనే జోరుగా కల్లు, మద్యం విక్రయాలు జరగడంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల చలువనా లేక వారి పర్యవేక్షణ లోపమా అని పలువురు చర్చించుకుంటున్నారు.