ఆర్టీఏ సేవలు ప్రారంభం

17-10-2026 | 04:03pm

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా వద్ద కలెక్టరేట్ సమీపంలో నూతనంగా నిర్మించిన జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం నుంచి ఆర్టీఏ సేవలు(RTA Services) ప్రారంభమైనట్లు జిల్లా రవాణా అధికారి ఇమ్రాన్ అహ్మద్ తెలిపారు. ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు.

డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు తదితర రవాణా శాఖ సేవలు నూతన కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు కార్యాలయం సులభంగా చేరుకునే ప్రాంతంలో ఉందన్నారు. ప్రజలు, వాహనదారులు అవసరమైన పత్రాలతో కార్యాలయాన్ని సంప్రదించి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇమ్రాన్ అహ్మద్ కోరారు.

మరిన్ని వార్తలు