జూపల్లి కృష్ణారావు వెటకాలపు మాటలు మానుకోవాలి

22-10-2026 | 08:46pm

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్కు ప్రతి సవాల్ విసిరారు.

కొల్లాపూర్ అక్టోబర్ 22: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Former Minister Niranjan Reddy).కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి( ex-MLA Beeram Harshavardhan Reddy) టీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించి మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ. మంత్రి జూపల్లి కృష్ణారావు  నిన్న నీళ్లు నార్లపూర్ రిజర్వాయర్ నుండి కిందికి ఎట్లా తీసుకుపోవాలో బి.ఆర్.ఎస్ నాయకులు చెప్పాలని విసిరిన సవాల్ ను.

నిరంజన్ రెడ్డి  స్వీకరించి నార్లపూర్ రిజర్వాయర్ ను సందర్శించి కుడికిళ్ల దగ్గర అడ్డంగా ఉన్న తుండు కట్టను మాజీ ఎమ్మెల్యే బీరం.హర్షవర్ధన్ రెడ్డితో కలసి పరిశీలించి సాంకేతిక అంశాలు జోడించి,పరిణతితో  రెండు పంపుల సామార్థ్యానికి సరిపోను తుండును తొలగిస్తే  గ్రావిటీ ద్వారా ఏదుల, వట్టేం,కర్వేనా రిజర్వాయర్లకు నీళ్లు తరలించవచ్చని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.

జూపల్లి కృష్ణారావు  సవాల్ స్వీకరించాము. సలహా ఇస్తున్నాం అమలు చేయండ నీళ్లు సహజంగానే పారతాయి నీలాగా ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి జంపు చేసే గుణం ఉండదు. ప్రభుత్వపరంగా జి.ఓ ఇచ్చి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇవ్వండి నార్లపూర్ నుండి నీళ్లు తరలించి రిజర్వాయర్లు నింపి చూపుతాం.

కుడికిళ్ల దగ్గర అడ్డంగా ఉన్న తుండు కట్టను పరిశీలించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. మీకు చేయడానికి చేతకాకపోతే జి.ఓ ఇచ్చి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇవ్వండి మేము దగ్గర ఉండి కట్టను తొలిగించి నీళ్లు తీసుకొచ్చి రిజర్వాయర్లు నింపి చూపుతాం అని అన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి  మాట్లాడుతూ.

మూడేండ్లలో పాలమూరు రంగారెడ్డిని పడావ్ పెట్టీ కుంటి సాకులు చూపుతూ రైతులను హరిగోస పెడుతున్నారని విమర్శించారు. నార్లపూర్ 10పంపులు ఒకేసారి నడిస్తే 26వేల క్యూసెక్కుల నీళ్లు ఈ కాలువ ద్వారా పారుతాయి ప్రస్తుతం రెండు పంపులు మాత్రమే నడుస్తున్నాయి. కాబటి తుండు కట్టలో పావు భాగం మట్టిని తొలగించిన నీళ్లు గ్రావిటీ ద్వారా రిజర్వాయర్లకు చేరుకుంటాయి.

కాబట్టి జిల్లా రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని తుండు కట్టను తొలిగించి నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు .మూడేండ్లలో మీకు ఈ చిన్న పని కూడా చేయడం చేతకావడం లేదు. కె.సి.ఆర్  27వేల ఎకరాల భూసేకరణ చేసి 35వేల కోట్లు ఖర్చు పెట్టీ 70టి.ఏం. సిల నీళ్లు నింపుకునే ఏదుల, వట్టేం,కర్వేనా రిజర్వాయర్లు సిద్ధంగా ఉంచారని కె.సి.ఆర్ కి పేరు వస్తుందని పాలమూరు రంగారెడ్డినీ పడావ్ పెట్టారని ధ్వజం ఎత్తారు.

జూరాల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులోకి 245టి.ఏం.సి నీళ్లు చేరాయని రేవంత్ నిర్లక్ష్యంతో 100కుపైగా టి. ఎం. సిలు ఆంధ్రా ప్రయోజనాల కోసం తరలించారని వారు ఆరోపించారు. నేటికి శ్రీశైలంలో 60టి. ఎం. సిల నీటి లభ్యత ఉంది 20టి.ఏం. సిల నీళ్లు ఎత్తిపోస్తే వానాకాలం పంటలు కాపాడగలుగుతాం,భూగర్భ జలాలు పెరిగి ప్రజల అవసరాలు తీరుతాయని అన్నారు.

కృష్ణారావు  వెటకారం మాటలు ఆపి రైతులకు నీళ్లు ఎట్లా ఇవ్వాలో ఆలోచించండి అని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి.టిఆర్ఎస్ నాయకులు నిరంజన్ గౌడ్. మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు