పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
వేంకటేశ్వర స్వామి ఆలయంలో సీపీ గౌష్ ఆలం ప్రత్యేక పూజలు
హాజరైన ఏసీపీలు, పోలీస్ అధికారులు
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల(Police Martyrs Commemoration Week) సందర్భంగా స్థానిక వేంకటేశ్వర స్వామి దేవాలయం(Venkateswara Swamy Temple)లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం(Karimnagar CP Goush Alam ) గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నారు.
ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ సమాజ శాంతి కోసం అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీతో పాటు ఏసీపీలు యాదగిరిస్వామి, వెంకటస్వామి, విజయకుమార్, టౌన్ మరియు ట్రాఫిక్ సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.