విహార యాత్రలా దేవాదాయ కమిషనర్ పర్యటన

03-10-2026 | 10:36pm

బిజినేపల్లి, అక్టోబర్ 03 : పాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం(Palem Sri Venkateswara Swamy Temple) గత నాలుగు సంవత్సరాలుగా తన పూర్వ వైభవం కొల్పోతుంటే తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ M.హనుమంత రావు(Hanumantha Rao) పర్యటన ఒక విహార యాత్రలా సాగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. పాలెం ఆలయంలో(Palem Temple) బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాలు నిర్వహించడంలో గత అధికారుల నీర్లక్ష్యం వహించారని, దీంతో పాలెం వెంకన్న ఆలయ వైభవం తగ్గడంతో నిత్య రద్దీ, పూర్వ వైభవం తగ్గిందని భక్తులు అంటున్నారు. ఆలయ అభివృద్ధి, ఉత్సవాలు, రద్దీ పెరగడం కోసం చేపట్టాల్సిన చర్యల విషయమై దేవాదాయశాఖ కమిషనర్ ఆరా తీయకుండా అర్చక బృందం చేత పూజలు చేయించుకోని తన విహార యాత్రలాగ ముగించుకోవడంపై స్థానిక భక్తులు, ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు