మొల్లచింతల పల్లి లోని 4కేజీల అడవి మాసం పట్టివేత
27-10-2026 | 05:00pm
కొల్లాపూర్ అక్టోబర్ 27: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొల్ల చింతలపల్లి గ్రామ అడవి సమీపంలో నాలుగు కేజీల అడవి మాంసం పట్టుబడినట్టు ఫారెస్ట్ అధికారి(Forest Officer) తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి ఎఫ్ఆర్ఓ వాణికుమారి తెలిపిన వివరాల ప్రకారం మొల్ల చింతలపల్లి గ్రామ అడవి సమీపంలోని ఇద్దరు వ్యక్తులు అడవి మాంసాన్ని తీసుకొని వస్తుండగా మా వెహికల్ ని చూసి పరారయ్యారని ఆమె తెలిపారు. నిధితుల కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని నాలుగు కేజీల మాంసం ఏం మాంసం తెలియాలంటే ల్యాబ్ కు టెస్టు కోసం పంపుతున్నామని ఆమె తెలిపారు.