వీర జవాన్ రక్షిత్ కుటుంబానికి బీజేపీ నేత పరామర్శ

27-10-2026 | 05:49pm

బోధన్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్ నవాతే రక్షిత్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి(BJP Leader Medapati Prakash Reddy) మంగళవారం పరామర్శించారు. రక్షిత్ తండ్రి, అంఢాపూర్ మాజీ సర్పంచ్ సత్యనారాయణను కలిసి వారి కుమారుడి అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రక్షిత్ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేస్తూ, కుమారుడిని కోల్పోయిన బాధను తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఈ క్లిష్ట సమయంలో మనోధైర్యాన్ని కోల్పోవద్దని కోరారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సిర్ప సుదర్శన్, పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపికిషన్, బీజేపీ సీనియర్ నాయకులు సంగ్రామ్ పటేల్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు గౌతమ్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి నీరడి బాబురావు, బీజేపీ నాయకులు మల్లెపూల శ్రీనివాస్ గౌడ్, అరే శ్రీపతి, సిర్ప ప్రశాంత్, జంగం సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు