మాదిగల అభివృద్దే మా లక్ష్యం...

27-10-2026 | 05:52pm

సీనియర్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లారపు రత్నయ్య

తాడ్వాయి,అక్టోబర్, 27( విజయ క్రాంతి ): మాదిగల అభివృద్దే మా లక్ష్యం అని సీనియర్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లారపు రత్నయ్య(Senior MRPS State Working President Allarapu Ratnaiah) తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మా గార్డెన్ లో మంగళవారం నిర్వహించిన సీనియర్ ఎమ్మార్పీఎస్ జిల్లా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాదిగ,మాదిగ ఉపకులాలకు జనాభా ప్రాతిపదికన దళిత బంధు, ఉద్యోగాలు, రాజకీయ,ప్రాథమిక అన్ని విషయాలలో న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు.మాదిగ, మాదిగ ఉపకులాలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి పోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాదిగ, మాదిగ ఉపకులాలకు ప్రత్యేక చొరవ తీసుకొని న్యాయం చేయాలని కోరారు.

గత 30 సంవత్సరాలుగా మాదిగ,మాది ఉపకులాల కోసం చేసిన పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేశారని తెలిపారు. మాదిగలకు ఉద్యోగాలలో ప్రత్యేక అవకాశం కల్పించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాదిగ, మాదిగ ఉపకులాలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మాదిగ,మాదిగ ఉపకులాలు అనుభవిస్తున్న అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన కోరారు.మాదిగ జాతి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  సంజీవరావు,రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర రామ్ చందర్ రావు, జిల్లా అధ్యక్షులు సురేష్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న మాదిగ,నాయకులు బాలమణి,రాజమణి, శ్రీదేవి,ఇందిరా, యాదయ్య,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. 

-

మరిన్ని వార్తలు