కుకట్‌పల్లిలో రిజిస్ట్రేషన్‌.. మూడు ప్రాంతాల్లో రంగుల తయారీ!

27-10-2026 | 05:48pm
  1. అల్ట్రా పిగ్మెంట్స్‌’పై సామాజిక కార్యకర్తల ఫిర్యాదు
  2. ప్రజారోగ్యంపై ఆందోళన.. కలెక్టర్‌ జోక్యానికి విజ్ఞప్తి

మఠంపల్లి అక్టోబర్‌ 27(విజయ క్రాంతి): సూర్య పేట జిల్లా మఠంపల్లి మండలంలోని రఘునాథ పాలెం గ్రామం(Raghunatha Palem Village) సమీపంలో కంపెనీ పేరు ఒకటి కార్యకలాపాలు మూడు ప్రాంతాల్లోనా? అనుమతుల సంగతేంటి? ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందన్న ఆరోపణలపై అధికారులెప్పుడు స్పందిస్తారు?

‘అల్ట్రా పిగ్మెంట్స్‌’ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కార్యకలాపాలపై సామాజిక కార్యకర్తలు లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కంపెనీ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం,తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న ప్రాంతాలు,భూముల వివరాలపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్‌ చేశారు.కంపెనీ వివరాలివే..

సామాజిక కార్యకర్తలు సమర్పించిన ఫిర్యాదు ప్రకారం, ‘అల్ట్రా పిగ్మెంట్స్‌’ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కంపెనీ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్నట్లు పేర్కొన్నారు.అలాగే రంగుల తయారీ కార్యకలాపాలకు సంబంధించి ఫిర్యాదులో ప్రస్తావించిన ప్రాంతాలు, సర్వే నంబర్లు ఇవి: రఘునాథపాలెం,మఠంపల్లి ప్రాంతం,సూర్యాపేట జిల్లా: సర్వే నంబర్‌ 318.

ఈ వివరాలను ఫిర్యాదుదారులు తమ లేఖలో ప్రస్తావించారు. అయితే కంపెనీ రిజిస్ట్రేషన్‌ చిరునామా,తయారీ యూనిట్ల ప్రస్తుత స్థితి, ఆయా ప్రాంతాల్లో కార్యకలాపాలకు ఉన్న అనుమతులను సంబంధిత ప్రభుత్వ రికార్డుల ద్వారా ధ్రువీకరించాల్సి ఉంది.

మూడు ప్రాంతాల్లో కార్యకలాపాలు.. అనుమతులపై స్పష్టత ఏదీ?

ఒకే కంపెనీకి సంబంధించి వేర్వేరు ప్రాంతాల్లో తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొనడంతో, ఆయా యూనిట్లకు అవసరమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై విచారణ జరపాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.భూముల వినియోగం,పరిశ్రమల అనుమతులు,పర్యావరణ నిబంధనలు,కాలుష్య నియంత్రణ మండలి నుంచి పొందిన అనుమతుల వివరాలను అధికారులు పరిశీలించాలని సామాజిక కార్యకర్తలు కోరారు.

అనుమతులు ఉన్నాయా? నిబంధనలు పాటిస్తున్నారా? అన్న ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు రికార్డుల ఆధారంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలి

కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన అనుమతులు,సర్వే నంబర్లు,భూముల వినియోగం,కాలుష్య నియంత్రణ చర్యలపై సమగ్ర విచారణ జరిపించాలని సామాజిక కార్యకర్త దేవపంగు ప్రసాద్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు