సొంత గ్రామం లో మొక్కలు నాటిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్

25-09-2026 | 02:48pm

దామరచర్ల: సెప్టెంబర్ :25 దామరచర్ల మండలం తన సొంత గ్రామమైన కేతావత్ తండాలో ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్(MLC Sri Ketavath Shankar Naik) శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.

పచ్చదనం పెంపొందించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలు, చలపతిరావు, హనుమంతు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు