నారాయణపేట్ జిల్లా మద్దూరు మున్సిపాలిటీ

24-10-2026 | 07:16pm

మద్దూరులో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు

విజేతలకు బహుమతుల ప్రదానం.. విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్ల పంపిణీ

మద్దూరు, విజయక్రాంతి: నారాయణపేట జిల్లా(Narayanpet District) మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో(Urdu medium school) CWC SPORTS MEET-2026 ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా మద్దూరు మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ కలపు దినేష్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు స్టీల్ వాటర్ బాటిళ్లను స్పాన్సర్ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మండల స్థాయి నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులను ఎంఈఓ జనార్దన్ రెడ్డి శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నరసింహులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలయ్య, కౌన్సిలర్లు నరసింహ, దినేష్, మౌలానా, గోపాల్, నింగ్య నాయక్, బీజేపీ నాయకులు సాయిలు, కాశీనాథ్, ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మణ్, వికలాంగుల ఐఆర్‌పీలు గీత, శకుంతల, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు