ఆలయానికి 50వేల విరాళాలు
లింగంపేట్ ,అక్టోబర్ 24 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) లింగంపేట మండల కేంద్రంలోని ముత్యాల పోచమ్మ ఆలయ(Mutyala Pochamma Temple) నిర్మాణానికి టిఆర్ఎస్ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్(Edurugatla Sampath Goud) 50వేల విరాళం శనివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
లింగంపేట్ మండల కేంద్రంలోని ఆదిపరాశక్తి ముత్యాల పోచమ్మ అమ్మవారి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది దాతల సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టడానికి ఆలయ కమిటీ సభ్యులు ముందుకు వచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు టిఆర్ఎస్ ఎల్లారెడ్డి నియోజకవర్గం సంపత్ గౌడ్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు.
ముత్యాల పోచమ్మ ఆలయం నిర్మాణం కోసం 50. యాబై వేల రూపాయలు విరాళం అందించారు. 50వేల వివరాలు అందించినందుకు ఆయనను ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పూజారులు అభినందించారు.తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన భరోసించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోకల సాయిరాం.జిల్లా యూత్ అధ్యక్షుడు దేగావత్ జైల్ సింగ్.జిల్లా అధ్యక్షుడు నానక్ సింగ్.పాండు.ఐలాపూర్ ఉపాధ్యక్షులు సాయిలు.చెన్నం ఉషయ్య. చెన్నం స్వామి.నరేష్.రవి.మల్లేష్ కిషన్.చేన్నం సాయిలు.అశోక్ పాల్గొన్నారు.