డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అమ్ముకున్నది
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి
డ్రైవర్లు, పీఏలు, డబ్బులు ఉన్నోళ్లకు ఇచ్చాడు
కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ రెడ్డి
ఎల్బీనగర్, అక్టోబర్ 24 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో(LB Nagar Constituency) పేదలకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను(Double bedroom houses) అమ్ముకున్న ఘనత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికే(MLA Sudheer Reddy) దక్కుతుందని, ఆయన డ్రైవర్లు, పీఏలు, డబ్బులు ఉన్నోళ్లకు ఇచ్చాడని కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రభుత్వంపై డబల్ బెడ్ రూమ్ స్కాం అంటూ ఆరోపణలు చేస్తున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి(MLA Sudheer Reddy) గత ప్రభుత్వంలో చేసిన డబుల్ బెడ్ రూమ్ దందా మరిచిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రవీణ్ రెడ్డి లింగోజిగూడ లోని తన కార్యాలయంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావన్నారు.
డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలకు అందాల్సిన చోట ఎమ్మెల్యే లెటర్ హెడ్ తో అధికారులకు బెదిరింపులు చేసి ఎల్బీనగర్ నాంచారమ్మ బస్తీ, వనస్థలిపురం సాహెబ్ నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో తన ఇంట్లో, ఫార్మ్ హౌస్ లో, స్నేహితుల ఇంట్లో పనిచేసే పనోళ్లకు, పీఏలకు, ఫోటో గ్రాఫర్లకు, భూ యజమానులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అమ్ముకున్న చరిత్ర సుదీర్ రెడ్డిదేనని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లింగోజిగూడ డివిజన్ అధ్యక్షుడు కందికంటి శ్రీధర్ గౌడ్, నాయకులు మనోజ్, వెంకట్, రోహిత్, నరేందర్, సచిన్, శివ తదితరులు పాల్గొన్నారు.