గిరిజనుల కుల ధ్రువీకరణ పత్రాల జారీ సమస్యను పరిష్కరించాలి
గిరిజన మంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే
బోథ్. అక్టోబర్ 24( విజయక్రాంతి) ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad District) గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కుల ధ్రువీకరణ పత్రాల(Caste certificate documents) జారీలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలను(Job opportunities) కోల్పోతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన గిరిజనులందరికీ కుల ధ్రువీకరణ పత్రాలు నిబంధనల ప్రకారం జారీ చేయాలని ఈ విషయమై తవ చర్యలు తీసుకోవాలని మంత్రికి విన్నవించారు.