సీబీఎస్ఈ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

06-11-2026 | 08:05pm

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ(CBSE) పదో, 12వ తరగతి బోర్డ్ పరీక్షలు(Board Exams) వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బోర్డు తాజాగా డేట్ షీట్ విడుదల చేసింది. అన్ని పరీక్షలు ఉదయం 10:30 గంటలకు మొదలవుతాయని ప్రకటించింది. పరీక్షలకు 101 రోజుల ముందుగానే షెడ్యూల్ ప్రకటించడం విశేషం.

10వ తరగతిలో 83, 12వ తరగతిలో 121 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు పరీక్షల మధ్య తగిన సమయం ఉండేలా, ఇతర పోటీ పరీక్షల షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుని టైమ్‌టేబుల్ రూపొందించినట్లు సీబీఎస్ఈ తెలిపింది. ఇందుకోసం సుమారు 40 వేల సబ్జెక్ట్ కాంబినేషన్లు(Subject Combinations) పరిశీలించింది. ఈసారి 10వ తరగతికి 26.5 లక్షల మంది, 12వ తరగతికి 19.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

మరిన్ని వార్తలు