ఊరూరా సభలు

06-10-2026 | 05:05am

‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన కాంగ్రెస్

  1. ఈ నెల 10 నుంచి నవంబర్ 26 వరకు నిరసనలు, ర్యాలీలు 
  2. నవంబర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ఇండి కూటమి సభ 
  3. పీసీసీ అధ్యక్షులతో చర్చించిన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ 
  4. సీఈసీ పదవి నుంచి జ్ఞానేశ్ కుమార్‌ను తప్పించి అరెస్టు చేయాలని డిమాండ్

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌తో(CEC Gyanesh Kumar) కలిసి కేంద్రంలోని మోదీ సర్కార్(Modi government) ఓట్ల చోరీకి(Vote Theft) పాల్పడుతున్నదని, దీనికి వ్యతిరేకంగా భారీ ఉద్యమానికి శ్రీకా రం చుట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నెల 10 నుంచి వచ్చే నెల 26 వరకు దేశవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో నిరసనలు, ర్యాలీలు(Protests and rallies) చేపట్టనుంది.  ప్రతి ఊరిలో ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహించి, ‘ఓట్ చోరీ’ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లా లని పార్టీ నిర్ణయించింది. ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ పేరిట ఈ కార్యక్రమాలు కొనసాగించనుంది.

ఏఐసీసీ చీఫ్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఇందులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, పీసీసీ అధ్య క్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ‘ఓట్ చోరీ’, ‘సర్’కు వ్యతిరేకంగా బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థా యిల్లో ఆందోళనలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. సీఈసీ పదవి నుంచి జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి, అరెస్ట్ చేసి, విచారిం చాల ని డిమాండ్ చేశారు. అప్పటి వరకు పోరా టం ఆగబోదని తేల్చిచెప్పారు. అక్టోబర్ 10న బ్లాక్ లెవల్‌లో ఆందోళనలు, ర్యాలీలు మొదలుపెట్టి.. రాజ్యాంగ దినోత్సవమైన నవంబర్ 26 వరకు కొనసాగిస్తామని ప్రకటించారు.

సమావేశం అనంతరం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యమ కార్యాచరణను వెల్లడించారు. ‘దేశవ్యాప్తంగా బీజేపీ మెగా ఓట్ చోరీకి పాల్పడు తున్నది. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌తో కలిసి ఈ అక్రమాలకు తెరలేపింది. దీనికి వ్యతిరేకంగా బ్లాక్ లెవల్ నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆందోళనలు చేపట్టాలని సమావేశం నిర్ణయించాం. ఓట్ బచావో.. దేశ్ బచావో పేరిట దాదాపు 45 రోజుల పాటు విడతలవారీగా ఈ ఆందోళనలు కొనసాగుతాయి’ అని వివరించారు.

కాంగ్రెస్ ఉద్యమ కార్యచరణ ఇదీ:

అక్టోబర్ 10 నుంచి 20 వరకు బ్లాక్ లెవల్‌లో నిరసన ర్యాలీలు 

అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25: ప్రతి ఊరిలో గ్రామ సభలు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, ఓట్ చోరీపై ప్రజలకు అవగాహన కల్పించడం. ‘సర్’లో ఓటు కోల్పోయినవారిని గుర్తించి, వారిని తిరిగి జాబితాలో చేర్పించేలా పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్వో) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు. బీఎల్వోలను ఓటు రక్షకులుగా పేర్కొన్న కాంగ్రెస్. 

నంబర్ 1: ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండి కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, సభ.వంబర్ 25 నుంచి 26 వరకు: ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం. వాహనాల ర్యాలీ. 

మరిన్ని వార్తలు