‘టాటా’ను నాశనం చేస్తున్న కేంద్రం
- వ్యాపారులు మాట్లాడకపోయినా తాను నిలదీస్తా
- ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాపై విమర్శలు
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు
- వ్యాపారుల స్ఫూర్తిని అణిచేశారు: మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: టాటా చైర్మన్ నియామకంలో వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్(Congress leader Rahul Gandhi) గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బుధవారం ఈ వివాదంపై ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వివాదంపై ఏ వ్యాపారి మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారని మండిపడ్డారు. టాటా గ్రూప్ సామాజిక సామాజిక నిబద్ధతను, యాజమాన్య విధానాలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సంస్థను కుట్ర పూరితంగా నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
టాటా గ్రూప్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితిపై రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంస్థ నిబద్ధతను, యాజమాన్య విధానాలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలో వ్యాపారమంటే ఆటబొమ్మ కాదని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌లు తెలుసుకోవాలన్నారు. దీనిపై ఎవరూ ప్రశ్నించకపోయినా, తనకు ప్రశ్నించే ధైర్యముందన్నారు. ఈ విషయంలో తగిన న్యాయం జరిగేలా చూస్తానని రాహుల్ గాంధీ తెలిపారు.
రాజకీయం చేయొద్దు: మంత్రి నిర్మలా సీతారామన్..
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ప్రతీ విషయాన్ని రాజీయం చేయొద్దన్నారు. సంస్థకు సంబంధించిన న్యాయపరమైన వివాదమన్నారు. అపనమ్మకాన్ని వ్యాప్తి చేస్తూ వ్యాపారులను తమతో చేరమని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు. వాణిజ్యపరమైన విషయాలను నేరపూరితమైనవిగా ముద్ర వేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ‘లైసెన్స్ కోటా రాజ్’ పేరుతో దేశ పారిశ్రామికవేత్తల స్ఫూర్తిని అణచివేసి కోట్లాదిమందిని పేదరికంలోకి నెట్టిందని మంత్రి విమర్శించారు.