మా ఆమోదం లేదు

06-10-2026 | 05:05am

ఫారం-6లో మార్పులపై స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ఎవరు ఆ సవరణలు చేశారో తేలాలని వ్యాఖ్య 

  1. కోర్టు ఆమోదం ఉందంటూ ఇటీవల ఈసీ ప్రకటన 
  2. మరింత వివాదానికి దారితీసిన ‘సర్’ 
  3. ఈసీ నిర్ణయాలను సమీక్షిస్తాం: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ 
  4. ఏకపక్షమైతే వాటిని రద్దు చేస్తామని స్పష్టీకరణ 
  5. రికార్డులను అందజేయాలని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు
  6. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ సస్పెన్షన్‌కు నిరాకరణ  

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: కేంద్ర ఎన్నికల కమిషన్‌లో(Election Commission of India) తీవ్ర వివాదానికి దారితీసిన, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్(CEC Gyanesh Kumar) రాజీనామా డిమాండ్‌కు కారణమైన ఫారం-6లో మార్పులపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఆ మార్పులకు తమ ఆమోదం లేనేలేదని తేల్చిచెప్పింది. ఎవరు ఆ సవరణలు చేశారో తేలాల్సిన అవస రం ఉందని, ఎన్నికల కమిషన్ నిర్ణయాలను సమీక్షిస్తామని వెల్లడించింది. నిబంధనల ప్రకారం నిర్ణయాలు ఉన్నాయో లేదో చూసి, తప్పు జరిగినట్లు తేలితే చర్యలకు ఆదేశాలు ఇస్తామని చెప్పింది.

సర్ ప్రక్రియలో ఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందని, వాటిని రద్దు చేయాలంటూ ఇటీవల పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. అదేవిధంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్  జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కూడా పిటిషనర్లు కోరారు. ఫారం-6లో మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం ఉందంటూ ఈసీ చెప్తున్నదని కూడా గుర్తుచేశారు.

వీటిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్(CJI Justice Surya Kant) నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ‘ఈ విషయంలో మేం స్పష్టంగా ఉన్నాం. ఫారం--- ౬లో మార్పులకు మా ఆమోదం లేదు’ అని సీజేఐ స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ సస్పెన్షన్ కోసం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి మాత్రం నిరాకరించారు. రికార్డులు, రిపోర్టులను పరిశీలించకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పారు. ఎన్నికల కమిషన్ నిర్ణయా లు, రికార్డులు అందజేయాలని ఈసీకి ఆదేశాలు జారీ చేశారు.

 ఏమిటీ వివాదం?

కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం ఆ మధ్య ‘సర్’ ప్రక్రియ సందర్భంగా ఈసీ కీలక మార్పులు చేసింది. కొత్త గా ఓటు నమోదు చేసుకునేవాళ్లు ఆన్‌లైన్ పోర్టల్‌లో ఈ ఫారంతోపాటు అదనంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని నిబంధన పెట్టింది. ఇందులో.. ‘2002 నాటి ఓటర్ల సవరణ జాబితాలో మీ పేరు ఉందా.. లేదా?, మీ పే రు లేకపోతే మీ అమ్మానాన్న, సంబంధీకుల పేర్లు ఉన్నాయా?’ అని ప్రశ్నలు ఉంచింది. అయితే.. ‘వీటిని పూర్తి చేయడం తప్పనిసరి కాదు’ అని ప్రస్తావించినప్పటికీ.. వాటిని ఆన్‌లైన్‌లో పూర్తిచేయకుండా అప్లికేషన్‌ను సబ్మిట్ చేయలేని తీరుగా ఆన్‌లైన్ వర్షన్ రూపొందించారు.

కొత్తగా ఓటు నమోదు చేయించుకునేవాళ్లకు ఫారం-6 ప్రకారం కేవలం వయసు, నివాస వంటి సాధారణ ధ్రువీకరణలు మాత్రమే అడగాల్సి ఉంటుం ది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్-1960 ప్రకారం ఈ ఫారం ఎలాంటి మార్పు లు చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేస్తే.. పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. సర్ ప్రక్రియలో మాత్రం ఫారం-6కు అదనంగా సె ల్ఫ్ డిక్లరేషన్‌ను ఈసీ జోడించడం వివాదాస్పదమైంది.

అది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని, తాము దాన్ని వ్యతిరేకిం చినప్పటికీ సర్ ప్రక్రియలో చేర్చారంటూ ఇటీవల ఎలక్షన్ కమిషన్‌లో ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అన్నట్లు వార్తా కథనాలు వచ్చాయి. దీంతో ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ తీరును తప్పుబడుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

కుట్ర పూరితం గానే సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, ఆయనను పదవిలో నుంచి తొలగించాలంటూ ప్రతిపక్ష పార్టీలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. 

ఇదే క్రమంలో సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సర్ ప్రక్రియలో ఈసీ నిర్ణయాలను సమీక్షించాలని, ఏకపక్షంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీ జ్ఞానేశ్‌ను సస్పెండ్ చేయాలంటూ పలువురు పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. 

ఏకపక్షమైతే రద్దు చేస్తాం

‘సర్’ ప్రక్రియలో భాగంగా ఫారం సెల్ఫ్ డిక్లరేషన్‌కు సంబంధించి గానీ, ఎలాం టి మార్పులకు సంబంధించి గానీ తమ ఆమోదం లేదని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆమోదం ఉందంటూ ఇటీవల ఈసీ చెప్పిన అంశాన్ని పిటిషనర్లు ప్రస్తావించగా.. పైవిధం గా స్పందించారు. ఎన్నికల కమిషన్‌లో ఏకపక్ష నిర్ణయాలు జరిగిపోతున్నట్లు  సాక్షాత్తు ఇద్దరు కమిషనర్లు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయని, ఆ నిర్ణయాలపై సమీక్షించాలని ఓ పిటిషనర్ అ భ్యర్థించారు. ఆ నిర్ణయాలను రద్దు చేయాలని కోరారు. దీనికి జస్టిస్ సూర్యకాంత్ బదులిస్తూ.. ఆ నిర్ణయాలను సమీక్షిస్తామని, ఏకపక్షంగా జరిగినట్లయితే వాటిని పక్కనపెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.    

ఆమోదం ఉందని వారం కింద చెప్పిన ఈసీ

సర్ ప్రక్రియలో ఫారం-6కు అదనంగా డిక్లరేషన్ చేర్చడంపై వివాదం చెలరేగిన నేపథ్యం లో గత నెల 28న ఈసీ.. ఈ మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం ఉందని ప్రకటించింది. అదేవిధంగా సర్ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాల్లో డిక్లరేషన్‌ను తొలగిస్తున్నామని, అక్కడ కొత్తగా ఓటు నమోదు చేసుకునేవాళ్లు ఆ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్ తెలిపింది. సర్ ప్రక్రియ కొనసాగుతున్న రాష్ట్రాల్లో మాత్రం డిక్లరేషన్ ఉంటుందని ఈసీ తెలిపింది.  కాగా మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం ఉందని ఒకవైపు ఎన్నికల కమిషన్ చెప్పడం.. అలాంటిది ఏమీ లేదని సుప్రీంకోర్టు తాజాగా ప్రకటించడంతో ‘సర్’ వివాదం మరింత చర్చనీయాంశమైంది.  

మరిన్ని వార్తలు