4 September, 2026 | 10:49 PM

Breaking News

అబద్దాల కాంగ్రెస్ ని తరిమి కొట్టండి   •   ఉమ్రిలో ఘనంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం   •   శిరీష కుటుంబానికి అండగా నిలవాలి   •   మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •  

ప్రైవేటు దిశగా ఆర్టీసీ అడుగులు

04-09-2026 | 05:45am

ఇప్పటికీ 40 శాతం బస్సులు ప్రైవేట్‌వే.. 

తాజాగా ఔట్ సోర్సింగ్ కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాలు 

సంస్థ మనగడకే ప్రశ్నార్థకం అంటున్న ఆర్టీసీ ఉద్యోగులు 

నిర్మల్ ఆగస్టు 3 (విజయక్రాంతి): ప్రయాణికుల సేవే ప్రథమ కర్తవ్యం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీజీ ఆర్టీసీ(TGSRTC) రోజురోజుకు ప్రైవేటీకరణ దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఆర్టీసీ సంస్థను బలోపితం చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా టీజీ ఆర్టీసీలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై ఆర్టీసీ ఉద్యోగులు(RTC Employees) మండిపడుతున్నారు.

అదిలాబాద్ రీజియన్ పరిధిలోని నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, అదిలాబాద్, భైంసా, ఉట్నూర్, డిపోలు ఉండగా ఆయా డిపోలో తాజాగా 68 మంది ఔట్సోర్సింగ్ కండక్టర్లను నియమించినట్టు ప్రచారం జరుగుతుంది. రెండు నెలల క్రితమే ఔట్సోర్సింగ్ ద్వారా డ్రైవర్ల నియామకాన్ని చేపట్టింది.

టీజీ ఆర్టీసీ బలుపితం చేయడానికి ఆ సంస్థ నియామకాలు చేపట్టవలసి ఉండగా తాజాగా ప్రవేటు భాగస్వామ్యంతో ఉద్యోగ నియామకాలు చేపట్టడంపై వారికి ఉద్యోగ భద్రత కరువవుతుంది. గత నెల ఒకటి నుంచి టీజీ ఆర్టీసీ ద్వారా నిర్మించబడుతున్న కార్గో సేవలను ప్రైవేటు పరం చేసింది.

టీజీ ఆర్టీసీ ప్రారంభించిన కార్గో సేవల తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేట్ కొరియర్ సర్వీసులు చాలావరకు గిరాకీ లేక ఇబ్బంది పడ్డారు. మహాలక్ష్మి పథకం వల్ల ఉమ్మడి జిల్లాలో ప్రయాణికుల రేషియో పెరిగి బస్సులు సరిపోక నానా తండాలు పడుతున్నారు. ఈ సందర్భంలో టీజీ ఆర్టీసీ బస్సులతో పాటు కండక్టర్ డ్రైవర్ ఇతర పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాల్సిన తరుణంలో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టడంపై సంస్థను పరోక్షంగా ప్రైవేటీకరణకు ప్రోత్సహించడమేనని టీజీ ఆర్టీసీ యూనియన్ నేతలు చెప్తున్నారు. 

ఇప్పటికే సగం బస్సులు ప్రైవేటు 

అదిలాబాద్ రీజియన్ పరిధిలో మొత్తం ఆరు డిపోలు ఉండగా 641ఆర్టీసీ బస్సులు ప్రతిరోజు2.58 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలను చేరుస్తున్నాయి. కొత్త నియామకా లు చేపట్టకపోవడంతో ఉన్న ఉద్యోగులతోనే కిలోమీటర్లు పెంచి, ఉన్న సిబ్బందికి అదన పు పని గంటల భారాన్ని మోపుతూ ఆర్టీసీని నిర్వహిస్తున్నారు.

అయితే చాలా డిపోలో కొన్ని సంవత్సరాల క్రితం మంజూరైన టీజీ ఆర్టీసీ బస్సులను తిప్పుతున్నారు. అవి కాలం చెల్లినప్పటికీ మరమ్మత్తులతో రోడ్లపైకి తెస్తున్నారు. తరచుగా ఆ బస్సులు మురయిస్తున్నాయి. కొత్త బస్సులు తక్కువ స్థాయిలోనే ప్రభుత్వం డిపోలకు అందిస్తోంది. దీనికి తోడు గత 10నుంచి టీజీ ఆర్టీసీలో ప్రైవేటు బస్సులకు అనుమతి ఇస్తున్నారు.

ఉమ్మడి అదిలాబాద్ రీజియన్ పరిధిలో 641 బస్సులు ఉన్నాయి. సర్వీసులో దాదాపు 295 వరకు ప్రైవేటు బస్సులే ఉండగా మిగతా బస్సులు ఆర్టీసీ యాజమాన్యం ద్వారా నడుపుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరు డిపో పరిధిలో మొత్తం డ్రైవర్లు 759 కాగా కండక్టర్లు 968 మంది విధులు నిర్వహిస్తున్నారు. దీనికి 187 మంది డ్రైవర్లు అవుట్సోర్సింగ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మిగతా నాలుగు వందల మంది శ్రామికులకు ఇతర ఉద్యోగులు ఉన్నారు.

దీనికి తోడు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ ఆయా డిపోలో ఐకెపి మహిళా సంఘాల సమైక్య ద్వారా ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. దీంతో చాలా డిపోలో నడుస్తున్న బస్సులో దాదాపు సగం వరకు ప్రైవేటు బస్సులే ప్రయాణికుల కోసం వినియోగిస్తున్నారు. ప్రైవేటు బస్సులో ప్రవేట్ డ్రైవర్ లు నిర్వహణ ఇబ్బంది గురవుతున్నారు. ప్రభుత్వమే బస్సులను కొనుగోలు చేసి డిపోలకు అప్పగిస్తే కొత్త వారికి ఉద్యోగాలు వచ్చి ఉద్యోగులతో పాటు ఉద్యోగంలో చేరిన వారికి భద్రత ఉంటుందని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు.

అలాగే బస్టాండ్లలో రిజర్వేషన్, బస్ డిపోలో క్రింది స్థాయి ఉద్యోగులు, రాజధాని ఇతర బస్సుల్లో మెయింటెనెన్స్ సిబ్బంది కౌంటర్లలో కూడా అవుట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. దేశంలోని అత్యంత ప్రాధాన్యతతో కూడిన ప్రజా రవాణా సంస్థగా పేరు చెప్పుకుంటున్న టీజీ ఆర్టీసీ ప్రస్తుతం నిర్వహిస్తున్న సంస్కరణల కారణంగా ప్రైవేటీకరణ, దిశగా రోజురోజుకు అడుగులు దగ్గర పడడంతో భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని టీజీ ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రవేటు రంగాన్ని ప్రోత్సహించడం మానుకొని ప్రభుత్వపరంగా టీజీ ఆర్టీసీని బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు.

ప్రభుత్వమే బస్సులు కొనాలి 

ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటుచేసిన టీజీ ఆర్టీసీలో సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికీ మా యా డిపోలో 300 పైగా ప్రైవేట్ బస్సులు నడిపిస్తున్నారు.

టీజీ ఆర్టీసీలో సంస్థ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టకపోగా అవుట్సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఉ ద్యోగ భద్రత ఆర్టీసీకి భద్రత కరువే ప్రమా దం ఉంది. దీనికి వ్యతిరేకంగా టీఎంయూ అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ప్ర భుత్వం సరైన విధానం అమలు చేయడం లే దు. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో కూడా అమలు కావడం లేదు. 

 ఆర్.గంగాధర్ రీజియన్ కార్యదర్శి 

ప్రభుత్వంలో విలీనం చేయాలి 

టీజీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ప్పుడే ఆర్టీసీకి బలమైన పునాది ఏర్పడుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆమె మేరకు ఉద్యోగులకు భ ద్రత కల్పించి ప్రభుత్వంలో విలీనం చేసి బెనిఫిట్ సౌకర్యాలు అందించాలి. టీజీ ఆర్టీసీలో ఉద్యోగుల భర్తీ పదేళ్లుగా లేకపోగా ప్రైవేట్ ఏజెన్సీల వారితో నిర్వహించ డం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి.

 రమేష్, ఎంప్లాయీస్ యూనియన్ నిర్మల్ డిపో అధ్యక్షులు

ప్రయాణికుల సంక్షేమానికి ప్రాధాన్యత

టీజీ ఆర్టీసీ ప్రయాణికుల సేవే ప్రథమ కర్తవ్యం భావిస్తూ అనేక ఆర్టీసీ సర్వీసులను గ్రామీణ పట్టణ ప్రాంతాలకు నడిపిస్తు న్నాం. సంస్థ నిర్ణయాలను డిపో పరిధిలో అమలు చేస్తూ ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా గమ్యస్థానాలను చేర్చి ఆర్టిసి ఆదాయానికి కృషి చేస్తున్నాం. ప్రైవేటు బస్సుల  వల్ల ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బంది ఉండదు. మహాలక్ష్మి పథకం అమలు అయిన తర్వాత బస్సులో రద్దీ పెరిగిన దానికి తగిన విధంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. ప్రయాణికులుసంస్థ మనుటకు సహకరించాలి.

 పండరి, డీఎం నిర్మల్