నాలా అనుమతిలేని పట్టా భూముల రిజిస్ట్రేషన్

04-10-2026 | 05:25am
  1. 22 ఏ బాధితులకు తీపి కబురు
  2. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): కొన్ని దశాబ్దాలుగా  ప్రజలు  ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసిందని రెవెన్యూ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Revenue Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు.

వ్యవసాయ భూములుగా ఉన్న పట్టా భూములు, అనంతరం నివాస వినియోగంలోకి వచ్చినప్పటికీ నాలా ప్రక్రియ పూర్తికాక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ శనివారం మెమో జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు మెమో నెంబర్ 48062/యూఎల్‌సీ/ఏ1/2026 ద్వారా జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. శనివా రం రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మం త్రి పొంగులేటీ మాట్లాడుతూ.. నాలా ప్రక్రియ పూర్తికాకపోవడం వల్ల రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూమిగానే ఉండి, 22 ఏలో ఉన్న నివాస పట్టా భూముల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందు లను ప్రభుత్వం గుర్తించిందని స్పష్టం చేశా రు.

ఆయా దరఖాస్తులను రెవెన్యూ రికార్డులు, భూమి హక్కులు, క్షేత్రస్థాయి పరిస్థితు లను సమగ్రంగా పరిశీలించి  నిబంధనల ప్రకారం నాలా రుసుము, ఇతర ప్రభుత్వ రు సుములను వసూలు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన చ ర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. ఏళ్ల తరబడి తమ సొంత ప్లాట్లను విక్రయించుకోలేక, రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్న సామాన్య,

మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిర్ణయం వల్ల ఉపశమనం లభిస్తుందన్నారు. 22ఎ సమస్యల పరిష్కా రం కోసం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు క్షేత్రస్ధాయిలో పకడ్బందీగా అమలయ్యే విధంగా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాకోణంలో ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అమ లు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి సూచనల మేరకు ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అధికారులు చిత్తశుద్ధ్దితో బాధ్యతాయు తంగా అమలుచేయాలని ఆదేశించారు. గత నెల 16వ తేదీన శాసనసభ వేదికగా  సీఎం రేవంత్‌రెడ్డి 22 ఏ సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలకు అనుగుణంగా సహచర మంత్రులతో చర్చించి 22 ఏతో ముడిపడి ఉన్న 10 నుంచి12 సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరించేందు కు చర్యలు తీసుకుంటున్నామని వివరించా రు.

శాసనసభలో సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22 -ఏ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేశామని, ఆ తర్వాత జీ.ఓ 118, జీ.ఓ 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలను జారీచేశామ న్నారు. 22 -ఏ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్  దరఖాస్తుల పరిష్కారానికి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశామని, ఆ క్రమంలోనే తాజాగా నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ మెమో జారీచేశామని మంత్రి వెల్లడించారు.


 

మరిన్ని వార్తలు