మాధవపూరి హిల్స్ లో ఘనంగా అన్నదాన కార్యక్రమం

24-09-2026 | 09:41pm

మాధవపూరి హిల్స్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో

అమీన్ పూర్, సెప్టెంబర్ 24: అమీన్ పూర్  వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అమీన్ పూర్  డివిజన్ (Ameenpur Division)పరిధిలోని మాధవపురి హిల్స్  కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మజ్జిగ సంతోష్ రెడ్డి, అశోక్ గౌడ్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాధవపురి హిల్స్ ఉత్సవ కమిటీ, ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, సెక్రెటరీ సెక్రెటరీ మహిపాల్ రెడ్డి, ట్రెజరర్ మేఘనాథ్ రెడ్డి, మెంబర్స్: రవీందర్ రెడ్డి, వీరేంద్ర, ప్రసాద్, శ్రీనివాస్, నరేష్.

 పాల్గొని విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు భోజనం వడ్డించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్నదానం చేయడం ఎంతో గొప్ప సేవా కార్యక్రమమని అన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మజ్జిగ సంతోష్ రెడ్డి, అశోక్ గౌడ్, నిర్వాహకులను అభినందిస్తూ, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కాలనీ ప్రజలు, భక్తులు, వినాయక ఉత్సవ నిర్వాహకులు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు