అనురాగ్ లో ఐఈఈఈ స్టెప్ 2026–క్యాంపస్ నుంచి కెరీర్ వరకు కార్యక్రమం
ఘట్ కేసర్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ(Anurag University) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఐఈఈఈ–ఎస్ఎస్ఐటీ స్టూడెంట్ బ్రాంచ్ చాప్టర్ సహకారంతో ఐఈఈఈ స్టెప్ 2026 – క్యాంపస్ నుంచి కెరీర్ వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐఈఈఈ యంగ్ ప్రొఫెషనల్స్ స్టెప్ మద్దతు అందించగా, ఐఈఈఈ యంగ్ ప్రొఫెషనల్స్ అఫినిటీ గ్రూప్, హైదరాబాద్ సెక్షన్ సహకరించింది.
వివిధ ఐఈఈఈ స్టూడెంట్ బ్రాంచ్ చాప్టర్లు, సొసైటీలకు చెందిన ఐఈఈఈ విద్యార్థి సభ్యులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు కళాశాల విద్య నుంచి వృత్తిపరమైన జీవితంలోకి విజయవంతంగా అడుగుపెట్టేందుకు అవసరమైన కెరీర్ అవగాహన, వృత్తిపరమైన నైపుణ్యాలు, నెట్వర్కింగ్, నాయకత్వ లక్షణాలు, మార్గదర్శకత్వం మరియు ఐఈఈఈలో అందుబాటులో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించారు.