గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఈనెల 26న ఇంటర్వ్యూ
ఘట్ కేసర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి, అంకుషాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల(Telangana Social Welfare Residential Women's Degree College), మహేంద్రహిల్స్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ తెలిపారు.
కళాశాలలో న్యూట్రిషన్ – 1 పోస్టు, ఫిజికల్ డైరెక్టర్ (పి.డి.) – 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. న్యూట్రిషన్ పోస్టుకు సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్, పీజీ అర్హతతో పాటు కనీసం 55 శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎంఈటి/ఎస్‌ఈటి/పి హెచ్.డి. వంటి అదనపు అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు ఎం.పి.ఈడి లేదా సంబంధిత విద్యార్హతలు కలిగి ఉండటంతో పాటు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో నేరుగా హాజరై ఇంటర్వ్యూ, డెమోకు పాల్గొనాలని సూచించారు. ఇంటర్వ్యూ ఈనెల 26న ఉదయం 11 గంటలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల, మహేంద్రహిల్స్ లో జరుగుతుందని, మరిన్ని వివరాలకు 91 91210 04524ను సంప్రదించవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.