చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

19-09-2026 | 07:31pm

ఖానాపూర్ ( విజయక్రాంతి): భారత రాజ్యాంగంలో కల్పించబడ్డ చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి రవీందర్(Senior Civil Judge Ravinder) అన్నారు. శనివారం మామడ కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. బాల కార్మిక నిర్మూలన, విద్య హక్కు చట్టం, బాల్య వివాహాలు నిషేధ చట్టంపై అవగాహన కల్పించారు. తరగతి గదిలోకి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో  సంక్షేమ శాఖ అధికారి వినూత్న, న్యాయవాదులు రాజలింగ, లింగాగౌడ్, భరోసా ఎస్సై జ్యోతి, బాలల సంరక్షణ అధికారి మురళి. విద్యార్థులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు