ఆడపిల్ల పుట్టలేదని.. మా అమ్మ నాకే జడలు, గౌను వేసేది!
నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్(Pan-India period action film) ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్(The Paradise)’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) చెప్పిన సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే..
* నేను తొమ్మిదో క్లాసులో ఉండగా ‘జగడం’ సినిమాని థియేటర్‌లో చూసి నేనూ సినిమా తీయాలని బలంగా ఫిక్స్ అయిపోయా. ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్ వచ్చేశా. నేరుగా సుకుమార్(Sukumar)ను కలవడానికి వెళ్లా. పొద్దున లేచి ఆయన గేటు దగ్గర నిలబడటమే నాకు పని. అలా నాలుగేళ్లు అయిన తర్వాత ఆయన ఒక షార్ట్ ఫిలిం(Short film) చేసి తీసుకురమ్మన్నారు. అది చూసి జాయిన్ చేసుకున్నారు. ఆయన దగ్గర ‘రంగస్థలం(Rangasthalam)’ సినిమాకు పనిచేశా. కృష్ణవంశీ, రాజమౌళి, సుకుమార్, శేఖర్ కమ్ముల, పూరి(Krishna Vamsi, Rajamouli, Sukumar, Sekhar Kammula, Puri).. వీళ్ల ప్రభావం నా మీద బలంగా ఉంటుంది.
* ‘ప్యారడైజ్’ కథకు నిజ జీవిత సంఘటన, కొన్ని పాత్రలు, అలాగే ఫిక్షన్.. ఈ మూడు ఉన్నాయి. ఇందులో ఉండే రెవల్యూషన్, ఆ పాత్రలను నేను పుట్టి పెరిగిన గోదావరిఖని ప్రాంతం నుంచి స్ఫూర్తి పొందినవి. ఆదిలాబాద్, గోదావరిఖని ప్రాంతాల మధ్యలో జరిగిన సంఘటనలు తీసుకున్నా. నేను సికింద్రాబాద్ రైల్వేక్వార్టర్స్‌లో ఉన్నా. ఆ పక్కన ఉండే బస్తీలో జరిగే కథలాగా డిజైన్ చేశా. మా ఊర్లో నేను చూసిన సంఘటనలన్నీ మళ్లీ ఇక్కడ నాకు కనెక్ట్ అయ్యాయి.
* మా అమ్మ ఆడపిల్ల పుడితే బాగుంటుందని భావించారు. కానీ పుట్టలేదు. నాకే జడలు వేసి, గౌన్ వేసి పెంచారు. నా రెండో క్లాస్ వరకు నాకు జడలు ఉండేవి. జడలు అక్కడి నుంచి తీసుకున్నా. దీని వెనుక కూడా చాలా ఎమోషన్ ఉంటుంది.
* ‘దసరా’ ప్రమోషనల్ కంటెంట్ చూసి ‘కేజీఎఫ్’లా చాలా మాస్‌గా ఉంటుందనుకున్నారంతా. ప్యూర్ డ్రామా కావటంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యారని నాకు ఫీడ్‌బ్యాక్ వచ్చింది. రెండు రోజుల తర్వాత దానికి ట్యూన్ అయిపోయారు.. సినిమా బ్లాక్‌బస్టర్. ప్రేక్షకులు కోరుకునేది ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ‘ప్యారడైజ్’ తీసుకొస్తున్నాం. ఇందులో యాక్షన్ కంటే ఎమోషన్ డామినేట్ చేస్తుందని భావిస్తున్నా.
* నేను ఏదైనా మనస్ఫూర్తిగా అనుకున్నది వచ్చేంతవరకు చేస్తా. ఈ విషయంలో మా టీమ్‌ను ఇబ్బందిపెట్టా (నవ్వుతూ). అనుకున్న షాట్ వచ్చేంతవరకు వందసార్లు అయినా తీస్తా. కానీ ఒకసారి ఓకే అయిన తర్వాత మళ్లీ రీషూట్ జోలికి వెళ్లను.
* నాకు జానపద గీతాలు అంటే చాలా ఇష్టం. నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఆటోలో ప్రతిరోజూ ‘ఏష నాగుల’ పాట పెట్టేవారు. అనిరుధ్‌కు ఐడియా చెబితే చాలా అద్భుతంగా చేశాడు. నిజానికి ‘దసరా’లోనే ఆ పాట పెట్టాలనుకున్నా. ఇందులో కుదిరింది.
* ‘ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. ఇదే విషయాన్ని చిరంజీవితో కూడా చెప్పా (నవ్వుతూ). కాస్త ఫ్యామిలీ సమయం గడపాలని అనుకుంటున్నా. చిరంజీవితో సినిమా 100% ఉంటుంది.