6 September, 2026 | 3:31 PM

ఏఐటీయూసీ మహాసభలకు బెజ్జంకి కార్మికులు

06-09-2026 | 01:36pm

బెజ్జంకి, సెప్టెంబర్ 6(విజయక్రాంతి): కరీంనగర్‌లో నిర్వహిస్తున్న ఏఐటీయూసీ(AITUC) తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభల బహిరంగ సభకు బెజ్జంకి మండలానికి చెందిన కార్మికులు(Bejjanki workers) బయలుదేరారు. కార్మికుల వాహనాలను సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ జెండా ఊపి ప్రారంభించారు. రూపేష్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక విధానాలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి పండుగ పరశురాములు, కుంభం రాములు, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్‌,శ్రావణ్  పలువురు కార్మికులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు