గుండె శస్త్రచికిత్స చేయించుకున్న గణేష్‌కు సునీల్‌రెడ్డి పరామర్శ

30-09-2026 | 11:16pm

మంథని,(విజయక్రాంతి): ఇటీవల తీవ్ర గుండె నొప్పితో అస్వస్థతకు గురై కరీంనగర్‌లో బైపాస్ శస్త్రచికిత్స(Heart Bypass Surgery) చేయించుకుని ఇంటికి చేరుకున్న మంథని సీఐటీయూ కార్మిక సంఘం(CITU Trade Union) నాయకుడు బూడిద గణేష్‌ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా గణేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట మంథని పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సబ్బని సంతోష్, పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గుడ్ల గురువేష్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు