అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరమ్మత్తుతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట,(విజయక్రాంతి): సూర్యాపేట మున్సిపాలిటీ(Suryapet Municipality) పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరమ్మత్తుల పనులలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(Collector Tejas Nandalal Pawar) అధికారులను ఆదేశించారు. బుధవారం అయన మున్సిపల్ కమీషనర్ హనుమంత్ రెడ్డి తో కలిసి 14 వార్డు వినాయక నగర్, కృష్ణ నగర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ లలో రోడ్లను తనిఖీ చేశారు. వినాయక నగర్ మెయిన్ రోడ్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(Underground drainage) వలన డ్యామేజ్ అయిన రోడ్లను పరిశీలించి నాణ్యతతో త్వరితగతిన రోడ్లకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు.
కృష్ణనగర్ కాలనీ పార్కును సందర్శించి పార్కు అభివృద్ధి గురించి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఈఈ తో చర్చించారు. వార్డులో ఉన్న ఓపెన్ ప్లాట్లలో చెత్త పేరుకుపోయినందువలన వెంటనే అక్కడ చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని వర్షాకాలం దోమలు వలన అంటువ్యాధులలు ప్రబలే అవకాశం ఉన్నందువలన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్ల మీద నీళ్లు నిలువ ఉండకుండా చూడాలని, డ్రైనేజీ కాలువలలో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ కిరణ్ కుమార్, పబ్లిక్ హెల్త్, డి ఈ రమాదేవి, ఎస్సీ వెంకటేశ్వర్లు, ఏ ఇ అనిల్ వార్డ్ కౌన్సిలర్ సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.