గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిల సందర్భంగా రక్తదాన శిబిరాలు
ఘట్ కేసర్, అక్టోబర్ 2 (విజయక్రాంతి) : గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ల సందర్భంగా ఘట్కేసర్ లోని లాల్ బహదూర్ స్మారక యువజన సంగం భవనంలో(Youth Association Building) మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ- లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్కేసర్, లాల్ బహదూర్ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మల్కాజిగిరి జిల్లా సేవా భారతి డాక్టర్ హెడ్గే వార్ బ్లడ్ సెంటర్(Blood Donation Camp) బృందం 30 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
అలాగే పట్టణంలో గాంధీ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో 125 వ సారి రక్తదానం చేసిన శిష్టా సూర్యనారాయణరావు (బొట్టు సూరి) ని నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమాలలో రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, బిజెపి అధ్యక్షుడు కొమ్మిడి మైపాల్ రెడ్డి, మేకల నర్సింగ్ రావు, నందం గణేష్ బాబు,
మారం లక్ష్మారెడ్డి, సగ్గు వేణుమాధవ్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్కేసర్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షులు చందుపట్ల వెంకటరెడ్డి, లాల్ బహుదూర్ సంఘం అధ్యక్షుడు బ్రహ్మం, ప్రధాన కార్యదర్శి బచ్చు నగేష్ కుమార్ గుప్తా, అల్లు కమలాకర్, వేల్పుల రవికుమార్ బచ్చు మారయ్య, మేకల దాస్, పసుపునూరి చంద్రశేఖర్, రక్తదాతలు రామ్మోహన్, శ్రీధర్, సాయి, తనీష్, శ్రీకర్, తదితరులు పాల్గొన్నారు.