కార్ల్‌సన్‌కు 15 ఏళ్ల బాలుడు షాక్
- వందన్ అలంకార్ సవాయ్ సంచలనం
- వరల్ నెం.1 ను ఓడించిన ఢిల్లీ బుడ్డోడు
న్యూఢిల్లీ, ఆగస్టు 27 : ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సన్(Magnus Carlsen)కు ఢిల్లీకి చెందిన 15 ఏళ్ల యువ చెస్ ఆటగాడు(young chess player,) దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఆన్‌లైన్ బ్లిట్జ్ టోర్నమెంట్‌లో కార్ల్‌సన్ ను ఓడించి సంచలనం సృష్టించాడు. టైటిల్ ట్యూస్డే ఆన్‌లైన్ బ్లిట్జ్ ఈవెంట్‌లో కేవలం 50 ఎత్తుల్లోనే మాగ్నస్ కార్ల్‌సన్‌ను వందన్ చిత్తు చేశాడు. వందన్ అలంకార్ సవాయ్(Vandan Alankar Savai) వయసు 15 సంవత్సరాలు. ఫీడే క్లాసికల్ రేటింగ్ 2,288 కాగా, మాగ్నస్ కార్ల్‌సన్ రేటింగ్ 2,823. కార్ల్‌సన్ లాంటి దిగ్గజంతో ఆడుతున్నప్పటికీ వందన్ ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా చాలా వేగంగా తన ఎత్తులను వేశాడు.
ఆట సాగుతున్న సమయంలో మాగ్నస్ కార్ల్‌సన్ ఒక ఊహించని పెద్ద పొరపాటు చేశాడు. కార్ల్‌సన్ చేసిన తప్పును వం దన్ వెంటనే అందిపుచ్చుకున్నాడు. ఏమా త్రం పట్టువిడవకుండా, తన ఏకాగ్రతను కా పాడుకుంటూ 50 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను చెక్ మేట్ చేసి చిత్తు చేశాడు. అంతటి గొప్ప విజ యం సాధించినప్పటికీ, వందన్ ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా సాధారణంగానే ఉ న్నాడు. వెంటనే తన తల్లిదండ్రులకు, కోచ్‌కు చెప్పకుండా నిద్రపోయాడు. తర్వాత వాళ్లే ఈ విషయాన్ని తెలుసుకుని ఆనందించారు.






